Friday, June 30, 2017

ఆత్మహత్య చేసుకుందామని పట్టాల పైన పడుకున్నా..... కాన

ట్రైన్ గుద్ది 99 జఫ్ఫాగాళ్ళు చనిపోయారు..... .

అదృష్టంకొద్దీ ఒకడు...  బ్రతికిపోయాడు.....

వాడిని TV9 వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు

రిపోర్టర్ : చెప్పండి సర్ ఈ
              దుర్ఘటన ఎలా
              జరిగింది ?

జఫ్ఫా   : రైల్వే అధికారుల
              నిర్లక్ష్యం...
              ఒక తప్పుడు ప్రకటన
              వల్ల ఇదంతా జరిగింది

రెపోర్టర్ : ఏం తప్పుడు ప్రకటన
              సర్ ?

జఫ్ఫా : ఇంకొద్దిసేపట్లో ట్రైన్
            ప్లాట్ ఫామ్ మీదకి
             రాబోతుంది అని
             ప్రకటన చేసారు సర్...
             దానితో అందరూ
              భయపడి పట్టాల
              మీదకి   
              వెళ్ళిపోయారు..

               కాని వాళ్ళ
               దురదృష్టం ఏంటంటే
               ట్రైన్ ప్లాట్ఫామ్
               మీదకి రాలేదు
                పట్టాల మీదకే   
                వచ్చింది.....

రిపోర్టర్ : అయితే మీరు
              తెలివిగా
              తప్పించుకున్నారుగా సర్......

జఫ్ఫా : తొక్కేం కాదూ..... నా
            పాటికి నేను
            ఆత్మహత్య చేసుకుందామని పట్టాల పైన పడుకున్నా..... కానీ ప్రకటన విన్నాక వెళ్లి ప్లాట్ ఫామ్   పై పడుకున్నా....
������������������మీరు మాత్రమే నవ్వకుండా అందరికి షేర్ చేయండి...

భార్య తోడు లేకుంటే

భార్య ����: ఏమండీ  మన ప్రధాన మంత్రి మోడీ జీ  ఒక్క రోజులో విదేశీయాత్ర‌ చేసి  ఎలా తిరిగి వస్తారో కదా ???����

భర్త : అవునే భార్య తోడు  లేకుంటే చైనా .జాపాన్ . రష్యా చుట్టి మళ్ళీ డిల్లీ కి రావొచ్చు . .
అదే భార్య తోడు ఉంటే  బిగ్ బజార్ వెళ్ళినా సాయంత్రం   అయిన    టైమ్ సరిపోదు������

Wednesday, June 28, 2017

భార్య ప్రేమ...

భార్య ప్రేమ...

భార్య కొట్టిన దెబ్బకి ఒళ్ళంతా హూనమై తల పగిలి హాస్పిటల్ లో జాయిన్ అయిన భర్తకి ఇంజక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్ తో భార్య ఇలా అంది...

" మెల్లగా ఇంజక్షన్ చేయండి డాక్టర్.. ఆయన నొప్పికి తట్టుకోలేడు.. "

అదీ భార్య ప్రేమంటే... �� �� ��

పతంజలి వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ కోసం రాసిన కధ...

పార్కులో ఒక పెద్దింటబ్బాయి ఒక చిన్నింటి అమ్మాయి...







పారిపోయి పెళ్ళి చేసుకుందామా, లేక ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకుందామా? అని అడిగాడు అబ్బాయి.






చిన్నప్పటినుండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మా అమ్మా నాన్నా, నేను పారిపోయి పెళ్ళి చేసుకోలేను.  అలాగని ఇంట్లో చెప్పి చేసుకుందామంటే, మా ఇంట్లో ఇప్పట్లో నా పెళ్ళి గురించి ఆలోచించటంలేదు, ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం, మా నాన్న దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు.








దానికేముంది, పెళ్ళి చేసుకోవాటానికి డబ్బులు ఎందుకు?  రిజిస్టర్ మారేజ్ చేసుకుందాము అన్నాడు ఆ అబ్బాయి.










అయితే మా నాన్నతో మాట్లాడతావా అని అడిగింది.










మాట్లాడతాను, రేపే మీ ఇంటికి వస్తాను అన్నాడు ఆ అబ్బాయి.










మర్నాడు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాడు పెళ్ళి కోసం.










కూతురికి పెళ్ళి చేసే అంత డబ్బు నాకు లేదు, నా దగ్గర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నాడు ఆ తండ్రి.










వెయ్యి రూపాయలు సరిపోతాయి, మీ కుటుంబం మొత్తం, దగ్గిర బంధువులతో సహ రేపు ఉదయం తయ్యారుగా ఉంటే నేను వచ్చితీసుకు వెళ్తాను అన్నాడు ఆ అబ్బాయి.









అన్నట్టుగానే మర్నాడు ఉదయమే ఒక పెద్ద వానులో వచ్చి ఆ అమ్మాయిని ఇంకా వాళ్ళ బంధువులని ఎక్కించుకుని బయలుదేరాడు.










దారిలో ఒక మిఠాయి దుకాణం దగ్గర వాను ఆపి అమ్మాయి తండ్రిని రెండు కిలోలు లడ్డూ కొనమన్నాడు.










అలాగే ఆ తండ్రి తన దగ్గర ఉన్న వెయ్యి రూపాయల్లో ఎనిమిది వందలు పెట్టి మిఠాయిలు కొన్నాడు.










కొంత దూరం వెళ్ళిన తరువాత పూల దుకాణం దగ్గర వాను ఆపి ఆ అమ్మాయి తండ్రిని రెండు పూల దండలు కొనమన్నాడు.










చెప్పినట్టుగానే ఆ తండ్రి తన దగ్గర మిగిలిన డబ్బులతో రెండు పూల దండలు కొన్నాడు.  ఇప్పుడు అతని దగ్గర ఒక్క పైసా లేదు.










ఆ అబ్బాయి తిన్నగా రిజిస్టారు ఆఫీసు ముందు వాను ఆపి, అందరినీ లోపలకు తీసుకు వెళ్ళి పది నిముషాల్లో పెళ్ళి పూర్తి చేయించాడు.  ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పెద్దగా సమయం పట్టలేదు.










దండలు మార్చుకున్న తరువాత, అత్తామామల కాళ్ళకు దణ్ణం పెడుతూ, చూసారా వెయ్యి రూపాయలతో పెళ్ళి ఎలా అయ్యిందో అనేసరికి ఆనందంతో ఆ తండ్రికి కళ్ళ నీళ్ళు వచ్చాయి.










కానీ చాలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ సంసారంలో ఒక ఉపద్రవం వచ్చింది.










ఒక రోడ్డు ఆక్సిడెంట్ లో ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు.







ఆ వార్త విని వెళ్ళిన ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉన్న తన భర్త శరీరాన్ని చూసి భోరున ఏడ్చింది.








అయితే అతని గుర్తుగా, అతని బట్టలు ఇమ్మని పోలీసులని అడిగింది.








ఇంత రక్తంతో ఉన్న ఈ బట్టలు నీకెందుకమ్మా అంటే, ఆయన గుర్తుగా ఉంచుకుంటాను అని భోరున ఏడవటంతో సరే అని అతని చొక్కా ఇచ్చారు పోలీసులు.









ఇంటికి వెళ్ళి రక్తంతో తడసిన తన భర్త చొక్కాని బాగా ఉతికి బయట ఆరేసింది.









అయితే ఆరోజు రాత్రి కలలోకి ఒక పండు ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".









ఉలిక్కిపడి లేచిన ఆ అమ్మాయికి ఎవరూ కనిపించక పోవటంతో మళ్లా నిద్ర పోయింది.









మర్నాడు మళ్లా ఆ చొక్కాని ఉతికి బయట ఆరేసింది.









అయితే ఆరోజు రాత్రి కూడా కలలోకి అదే  ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు ఇంకా పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".










ఉలిక్కిపడి లేచిన ఆ అమ్మాయికి ఎవరూ కనిపించక పోవటంతో ఈసారి కొంచెం భయం వేసింది.










మర్నాడు మళ్లా ఆ చొక్కాని ఉతికి బయట ఆరేసింది.











అయితే ఆరోజు రాత్రి కూడా కలలోకి అదే  ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు ఇంకా పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".









ఇలా ఒక పదిరోజులు గడచి పోవటంతో ఆ అమ్మాయికి నిద్ర కరువై ముఖం వాడిపోవటంతో ఇంట్లో వాళ్ళు చాలా ఖంగారు పడ్డారు.









అయితే ఆ అమ్మాయి మటుకు ఎవరికీ ఆ కల గురించి గానీ, కలలో ముసలి మనిషి గురించి గానీ చెప్పలేదు.









ఒకరోజు తను లోపల గదిలో పని చేసుకుంటుండగా బయట తలుపు చప్పుడు రావటంతో తలుపు తీసే చూస్తే కలలో వచ్చిన ముసలి మనిషి ఎదురుగా కనిపించేసరికి కెవ్వు మని కేక వేసింది.









అప్పుడు ఆ ముసలి మనిషి... "ఖంగారు పడకు తల్లీ, నీ భర్త చొక్కా మీద ఉన్న మరకలు ఇంకా పోలేదు.  నువ్వు సాధారణ సబ్బులతో ఉతుకుతున్నావు.  పతంజలి వారి వాషింగ్ పౌడర్ నే వాడు అని చెప్పి మాయమయిపోయింది.









అప్పుడు తెర మీద పతంజలి వారి వాషింగ్ పౌడర్ పేకెట్ పెద్దగా కనిపిస్తుంది.









ఇది నేను పతంజలి వారి వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ కోసం రాసిన కధ... బాగుందా?









ఇప్పుడు మీ రక్తం ఉడికి పోతోంది కదా... నాకు ఉడికింది..
నాకు పంపినవాడి గురించి వెతుకుతున్నా... దొరికాడా చచ్చాడె..

ఇంక ఆలస్యం దేనికీ, మీరుకూడా ఈ ఆనందాన్ని పొందండి.

సరదానందo..... 'లావు తగ్గాలని '


������
*లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్..*

*సంజీవ్* :-
సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?

*డాక్టర్:*-
ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!

*సంజీవ్:*-
వేపుళ్ళు మంచివి కావంటుంటారు..

*డాక్టర్:*-
ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?

*సంజీవ్:*-
వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.

*డాక్టర్:*-
అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు??

*సంజీవ్:*-
పోనీ మద్యం మానేయాలంటారా?

*డాక్టర్:*-
ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది?
వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ?
బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.

*సంజీవ్:*-
మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..

*డాక్టర్:*-
లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!

*సంజీవ్:*-
వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు నిజమేనా?

*డాక్టర్:*-
ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా. ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!

*సంజీవ్:*-
అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..!!!.

*డాక్టర్:*-
చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!!??

*సంజీవ్:*-
పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?

*డాక్టర్:*-
ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?

*సంజీవ్:*-
మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?

*డాక్టర్:*-
రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?

*సంజీవ్:*- ???????
����������������������

Tuesday, June 27, 2017

సెలెక్షన్ అంత బాగోదు,  మీకు తెలిసిందేగా

అల్లుడు గారు... 
రేపు మీ బావమరిది కి ... 
అమ్మాయిని చూడటానికి వెళుతున్నాము... 
మీరు కూడా వచ్చి చుస్తే బాగుంటుందేమో!!" అన్నాడు "మాంగారు" 
"వద్దులెండి... 
మీరే చూసిరండి... 
నా సెలెక్షన్ అంత బాగోదు, 
మీకు తెలిసిందేగా ,మరి!!" అన్నాడు

నీకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు

ఒక రోజు కొత్తగా పెళ్ళైన జంట తీరికగా కూర్చొని ఉన్నారు. ఇంతలో
భర్త : మన పెళ్ళికి ముందు నీకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
భార్య : ఇంట్లో నుంచి ఒక కవర్ తెచ్చి ఇచ్చింది.
భర్త : ఇదేమిటి ఇందులో ఏడు బియ్యం గింజలు రెండు వందలు రూపాయల ఉన్నాయి.
భార్య: నాకు బాయ్ ఫ్రెండ్ మారినప్పుడు ఒక బియ్యం గింజ వేసేదాన్ని.
భర్త : ఈకాలంలో ఇంత మంది పరావాలేదు. మరి ఈ రెండు వందలు రూపాయలో.
భార్య : అలా వేసిన బియ్యం ఐదు కేజీలు అయితే అమ్మగా వచ్చిన డబ్బులు.
భర్త : ��������������

Complete కి Finish కి తేడా

�� భార్య: ఇంగ్లీష్ నేర్చుకుంటూ Complete కి Finish కి తేడా ఏమిటని భర్తను అడుగుతుంది.

��‍♂ భర్త: నేను నీకు లభించడంతో నీ జీవితం Complete అయింది.

��‍♂ నీవు నాకు లభించడంతో నా జీవితం Finish అయింది.

డెబిట్ కార్డ్ - క్రెడిట్ కార్డ్ - పాన్ కార్డ్

డెబిట్ కార్డ్ - ఫ్రెండ్ షిప్ లాంటిది "ఉన్నదాంతో సర్దుకుందాం మావా" అంటుంది.

క్రెడిట్ కార్డ్ - గర్ల్ ఫ్రెండ్ లాంటిది "స్థాయికి మించి ఖర్చు పెట్టాలనిపిస్తుంది"

పాన్ కార్డ్ - పెళ్ళాం లాంటిది "సంపాందిచే ప్రతి రూపాయీ తెలియాలనుకుంటుంది"