Wednesday, June 28, 2017

పతంజలి వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ కోసం రాసిన కధ...

పార్కులో ఒక పెద్దింటబ్బాయి ఒక చిన్నింటి అమ్మాయి...







పారిపోయి పెళ్ళి చేసుకుందామా, లేక ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకుందామా? అని అడిగాడు అబ్బాయి.






చిన్నప్పటినుండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మా అమ్మా నాన్నా, నేను పారిపోయి పెళ్ళి చేసుకోలేను.  అలాగని ఇంట్లో చెప్పి చేసుకుందామంటే, మా ఇంట్లో ఇప్పట్లో నా పెళ్ళి గురించి ఆలోచించటంలేదు, ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం, మా నాన్న దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు.








దానికేముంది, పెళ్ళి చేసుకోవాటానికి డబ్బులు ఎందుకు?  రిజిస్టర్ మారేజ్ చేసుకుందాము అన్నాడు ఆ అబ్బాయి.










అయితే మా నాన్నతో మాట్లాడతావా అని అడిగింది.










మాట్లాడతాను, రేపే మీ ఇంటికి వస్తాను అన్నాడు ఆ అబ్బాయి.










మర్నాడు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాడు పెళ్ళి కోసం.










కూతురికి పెళ్ళి చేసే అంత డబ్బు నాకు లేదు, నా దగ్గర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నాడు ఆ తండ్రి.










వెయ్యి రూపాయలు సరిపోతాయి, మీ కుటుంబం మొత్తం, దగ్గిర బంధువులతో సహ రేపు ఉదయం తయ్యారుగా ఉంటే నేను వచ్చితీసుకు వెళ్తాను అన్నాడు ఆ అబ్బాయి.









అన్నట్టుగానే మర్నాడు ఉదయమే ఒక పెద్ద వానులో వచ్చి ఆ అమ్మాయిని ఇంకా వాళ్ళ బంధువులని ఎక్కించుకుని బయలుదేరాడు.










దారిలో ఒక మిఠాయి దుకాణం దగ్గర వాను ఆపి అమ్మాయి తండ్రిని రెండు కిలోలు లడ్డూ కొనమన్నాడు.










అలాగే ఆ తండ్రి తన దగ్గర ఉన్న వెయ్యి రూపాయల్లో ఎనిమిది వందలు పెట్టి మిఠాయిలు కొన్నాడు.










కొంత దూరం వెళ్ళిన తరువాత పూల దుకాణం దగ్గర వాను ఆపి ఆ అమ్మాయి తండ్రిని రెండు పూల దండలు కొనమన్నాడు.










చెప్పినట్టుగానే ఆ తండ్రి తన దగ్గర మిగిలిన డబ్బులతో రెండు పూల దండలు కొన్నాడు.  ఇప్పుడు అతని దగ్గర ఒక్క పైసా లేదు.










ఆ అబ్బాయి తిన్నగా రిజిస్టారు ఆఫీసు ముందు వాను ఆపి, అందరినీ లోపలకు తీసుకు వెళ్ళి పది నిముషాల్లో పెళ్ళి పూర్తి చేయించాడు.  ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పెద్దగా సమయం పట్టలేదు.










దండలు మార్చుకున్న తరువాత, అత్తామామల కాళ్ళకు దణ్ణం పెడుతూ, చూసారా వెయ్యి రూపాయలతో పెళ్ళి ఎలా అయ్యిందో అనేసరికి ఆనందంతో ఆ తండ్రికి కళ్ళ నీళ్ళు వచ్చాయి.










కానీ చాలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ సంసారంలో ఒక ఉపద్రవం వచ్చింది.










ఒక రోడ్డు ఆక్సిడెంట్ లో ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు.







ఆ వార్త విని వెళ్ళిన ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉన్న తన భర్త శరీరాన్ని చూసి భోరున ఏడ్చింది.








అయితే అతని గుర్తుగా, అతని బట్టలు ఇమ్మని పోలీసులని అడిగింది.








ఇంత రక్తంతో ఉన్న ఈ బట్టలు నీకెందుకమ్మా అంటే, ఆయన గుర్తుగా ఉంచుకుంటాను అని భోరున ఏడవటంతో సరే అని అతని చొక్కా ఇచ్చారు పోలీసులు.









ఇంటికి వెళ్ళి రక్తంతో తడసిన తన భర్త చొక్కాని బాగా ఉతికి బయట ఆరేసింది.









అయితే ఆరోజు రాత్రి కలలోకి ఒక పండు ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".









ఉలిక్కిపడి లేచిన ఆ అమ్మాయికి ఎవరూ కనిపించక పోవటంతో మళ్లా నిద్ర పోయింది.









మర్నాడు మళ్లా ఆ చొక్కాని ఉతికి బయట ఆరేసింది.









అయితే ఆరోజు రాత్రి కూడా కలలోకి అదే  ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు ఇంకా పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".










ఉలిక్కిపడి లేచిన ఆ అమ్మాయికి ఎవరూ కనిపించక పోవటంతో ఈసారి కొంచెం భయం వేసింది.










మర్నాడు మళ్లా ఆ చొక్కాని ఉతికి బయట ఆరేసింది.











అయితే ఆరోజు రాత్రి కూడా కలలోకి అదే  ముసలి మనిషి వచ్చి "చొక్కాకి ఉన్న రక్తపు మరకలు ఇంకా పోలేదు అని చెప్పి మాయమయ్యి పోయింది".









ఇలా ఒక పదిరోజులు గడచి పోవటంతో ఆ అమ్మాయికి నిద్ర కరువై ముఖం వాడిపోవటంతో ఇంట్లో వాళ్ళు చాలా ఖంగారు పడ్డారు.









అయితే ఆ అమ్మాయి మటుకు ఎవరికీ ఆ కల గురించి గానీ, కలలో ముసలి మనిషి గురించి గానీ చెప్పలేదు.









ఒకరోజు తను లోపల గదిలో పని చేసుకుంటుండగా బయట తలుపు చప్పుడు రావటంతో తలుపు తీసే చూస్తే కలలో వచ్చిన ముసలి మనిషి ఎదురుగా కనిపించేసరికి కెవ్వు మని కేక వేసింది.









అప్పుడు ఆ ముసలి మనిషి... "ఖంగారు పడకు తల్లీ, నీ భర్త చొక్కా మీద ఉన్న మరకలు ఇంకా పోలేదు.  నువ్వు సాధారణ సబ్బులతో ఉతుకుతున్నావు.  పతంజలి వారి వాషింగ్ పౌడర్ నే వాడు అని చెప్పి మాయమయిపోయింది.









అప్పుడు తెర మీద పతంజలి వారి వాషింగ్ పౌడర్ పేకెట్ పెద్దగా కనిపిస్తుంది.









ఇది నేను పతంజలి వారి వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ కోసం రాసిన కధ... బాగుందా?









ఇప్పుడు మీ రక్తం ఉడికి పోతోంది కదా... నాకు ఉడికింది..
నాకు పంపినవాడి గురించి వెతుకుతున్నా... దొరికాడా చచ్చాడె..

ఇంక ఆలస్యం దేనికీ, మీరుకూడా ఈ ఆనందాన్ని పొందండి.

0 comments:

Post a Comment